హైదరాబాద్: 28°C
వార్తలు

ఆళ్లగడ్డలో వివాదాలపై స్పష్టత ఇచ్చా: అఖిలప్రియ

AP: ఆళ్లగడ్డలో ఏం జరిగినా సెన్సేషన్‌గా మారుతోందని TDP MLA అఖిలప్రియ అన్నారు. అధిష్ఠానం సూచనలతో TDP AP అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఆమె భేటీ అయ్యారు. ఆళ్లగడ్డలో వివాదాలు, సమస్యలను పల్లాకు వివరించానని అఖిలప్రియ చెప్పారు. నిజానిజాలు తెలియకుండా సోషల్ మీడియాలో కొందరు హైప్ క్రియేట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పార్టీ శ్రేణుల్లో అయోమయం ఉండకూడదనే పల్లాను కలిసినట్లు చెప్పారు.