హైదరాబాద్: 28°C
వార్తలు

బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన డీఎస్పీ

KMR: అన్ని దానాల కన్నా రక్తదానం ఎంతో గొప్పదని కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ అన్నారు. బుధవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ నరహరి తదితరులు పాల్గొన్నారు.