హైదరాబాద్: 28°C
వార్తలు

గురువు జీవితానికి మార్గదర్శి: ఉమర్ ఆలీషా

KKD: పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో గురుపౌర్ణమి సందర్భంగా జరిగిన సభలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. గురువు శిష్యుడిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపిస్తాడన్నారు. జీవాత్మ–పరమాత్మలు వేరు కాదని, అదే "తత్వమసి" బోధన సారాంశమని వివరించారు.