హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ సంస్కారానికి నెటిజన్లు ఫిదా..!

జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ స్వదేశానికి చేరుకున్నాడు. నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో తనను ఆత్మీయంగా పలకరించిన అత్తమ్మను చూడగానే ఆమె పాదాలకు నమస్కరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్‌గా మారింది. 'ఇది కదా మన భారతీయుల సంస్కారం' అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.