హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆగస్టు 1న ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు'

VZM: ఆగస్టు 1వ తేదీన ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్ర ప్రజల కలలు సాకారం కానున్నాయని రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి అచ్చెన్నాయుడు బుధవారం ఎయిర్‌పోర్ట్ వద్ద పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు అన్నివిధాలా న్యాయం చేస్తామన్నారు.