హైదరాబాద్: 28°C
వార్తలు

చెరువును పరిశీలించిన అధికారులు

SKLM: మందస మండలం బాలిగాం గ్రామంలోని అప్పయ్య చెరువు ఆక్రమణలకు గురైందన్న ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు బుధవారం స్థల పరిశీలన చేపట్టారు. తహసీల్దార్ బలివాడ శ్రీహరి, ఉప తహసీల్దార్ రామకృష్ణ తదితరులు సర్వే నంబర్-102 ప్రాంతాన్ని పరిశీలించారు. ఆక్రమణలపై సర్వే నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు.