హైదరాబాద్: 28°C
వార్తలు

రాజకీయ పార్టీల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష!

SS: హిందూపురం తహశీల్దార్ కార్యాలయంలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష నిర్వహించారు. సవరణ ప్రక్రియలో సహకరించిన పార్టీలకు, బూత్ లెవల్ ఏజెంట్లకు కృతజ్ఞతలు తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటరు నమోదుకు ఫారమ్-6, వివరాల సవరణకు ఫారమ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.