హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కాచి వడపోసిన నీరు మాత్రమే తాగాలి. ఈగలు వాలిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. రోగనిరోధక శక్తిని పెంచే వేడి సూప్‌లు, పండ్లు తీసుకోవాలి. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.