హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

PLD: బెల్లకొండ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పర్వదినం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జీవితాన్ని సన్మార్గంలో నడిపించే గురువులను, తల్లిదండ్రులను స్మరించుకుంటూ భక్తులు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.