హైదరాబాద్: 28°C
వార్తలు

గురు పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

SRPT: కోదాడ పట్టణంలోని 29వ వార్డులోని శ్రీ సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొని శ్రీ సాయిబాబా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.