హైదరాబాద్: 28°C
క్రీడలు

సారాంశ్‌‌పై అశ్విన్ కీలక వ్యాఖ్యలు

భారత టెస్ట్ జట్టులో ఆఫ్ స్పిన్నర్ సారాంశ్‌ను ఎంపిక చేయడంపై మాజీ స్పిన్నర్ అశ్విన్ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా అతడికి ఉందని కొనియాడాడు. క్రీజ్ నుంచి దూరంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసే భిన్నమైన ఆఫ్ స్పిన్నర్ అని తెలిపాడు. టీమిండియాలో ఇప్పటికే స్టార్ బౌలర్లు ఉన్నందున అతడికి ఆడే అవకాశం రాకపోవచ్చని, కానీ వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.