హైదరాబాద్: 28°C
క్రీడలు

KKR జట్టులోకి టీమిండియా మాజీ కోచ్

టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చేరాడు. భారత జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ సిఫార్సుతోనే డస్కటే టీమిండియా అసిస్టెంట్ కోచ్‌గా నియమితులయ్యాడు. కాగా, గతంలో గంభీర్ KKR మెంటార్‌గా ఉన్నప్పుడు డస్కటే ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు.