హైదరాబాద్: 28°C
క్రీడలు

CWG: హర్జిందర్ కౌర్‌కు సిల్వర్ మెడల్

గ్లాస్గోలోని కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో హర్జిందర్ కౌర్.. మహిళల 69 kgల కేటగిరీలో రజత పతకం సాధించింది. స్నాచ్ 101KG, క్లీన్ అండ్ జర్క్‌లో 120 kgలు మొత్తంగా 227 kgల బరువెత్తి సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. ఇండియాకు ఇప్పటికే వెయిట్ లిఫ్టింగ్‌‌లో 7 మెడల్స్, పారా పవర్ లిఫ్టింగ్‌లో ఒక మెడల్ వచ్చింది.