పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అతడు 23 పరుగులు చేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 3 ఫార్మాట్లలోనూ 4500కిపైగా పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు మరే ఆటగాడు ఈ ఘనత సాధించలేదు. కాగా, అతడు టెస్టుల్లో 4504, వన్డేల్లో 6626, టీ20ల్లో 4596 పరుగులు చేశాడు.
క్రీడలు
బాబర్ ఆజం ప్రపంచ రికార్డ్


