హైదరాబాద్: 28°C
క్రైమ్

మ్యాన్ హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు

TG: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్‌లో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. మియాపూర్ వైశాలినగర్ రైల్వే అండర్ పాస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వ్యక్తి హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన బాలయ్యగా గుర్తించారు. అతడి కోసం హైడ్రా, NDRF సిబ్బంది గాలిస్తున్నారు.