హైదరాబాద్: 28°C
క్రైమ్

ఫేక్ కాల్ సెంటర్ ముఠా గుట్టురట్టు

TG: హైదరాబాద్ కేంద్రంగా నడిచిన అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ ముఠా గుట్టురట్టు అయింది. అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడిన వికాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్నికల్ సపోర్ట్ పేరుతో విదేశీయులను నమ్మించి కోట్ల రూపాయలు వసూళ్లు చేశారు. మోసపూరిత నగదును క్రిప్టో రూపంలో తరలించినట్లు గుర్తించారు. ఇంటర్‌పోల్ సమాచారంతో ఈడీ దాడులు చేసింది.