హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర ప్రమాదం.. ఫ్లైఓవర్‌పై పలు వాహనాలు ఢీ

తమిళనాడులో విల్లుపురం సమీపంలోని ఫ్లైఓవర్‌పై పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరికొందరు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఒక ద్విచక్రవాహనం అదుపుతప్పి జారిపడి, ఎదురుగా వస్తున్న లగ్జరీ బస్సును ఢీకొట్టింది. వెనకనుంచి వేగంగా వస్తున్న ఓ కారు బస్సు వెనక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.