హైదరాబాద్: 28°C
క్రైమ్

విహారయాత్రలో విషాదం.. ఇద్దరు గల్లంతు

AP: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీ విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద వాగులో ఈతకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంకు చెందిన పెండెం కళ్యాణ్, పెండెం బాబీ అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.