హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

MLG: ములుగు పట్టణంలో రోడ్ వెడల్పు పనుల నేపథ్యంలో ఇవాళ (బుధవారం) విద్యుత్ సరఫరాలలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ రవి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రామాలయం టెంపుల్, గ్రామపంచాయతీ ప్రాంతం, కూరగాయల మార్కెట్, మస్జిద్ వెనుక ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.