హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రమాదాలకు నిలయంగా మలుపు

KRNL: ఆదోని చిన్న మార్కెట్లోని మార్కండేయ గుడి మలుపు వద్ద ఉన్న డ్రైనేజీ గుంత ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలువురు వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు గుంతలో పడి గాయపడినట్లు తెలిపారు. ప్రమాదకరంగా మారిన ఈ ప్రాంతంలో వెంటనే సైడ్వాల్ నిర్మించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.