హైదరాబాద్: 28°C
క్రీడలు

'కోహ్లీ సలహాలు నేను పట్టించుకోను'

టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ సూత్రాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలంటే ఆటతో పాటు లైఫ్‌స్టైల్, డైట్ చాలా కీలకమని అది కోనసాగించాలని సలహా ఇచ్చినట్లు తెలిపాడు. ఆ సలహాతో ఏడాదిన్నర పాటు కఠినమైన డైట్ పాటించినప్పటికీ, ఆ క్రమశిక్షణను ఎక్కువ కాలం కొనసాగించడం మాత్రం తన వల్ల కాలేదని సంజూ వెల్లడించాడు.