హైదరాబాద్: 28°C
వార్తలు

'పంట ఎండిపోతోంది.. ఆదుకోండి'

GNTR: వర్షాభావంతో వరి పంట ఎండిపోతుందని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ములకా శివ సాంబిరెడ్డి డిమాండ్ చేశారు. తేలప్రోలు, కంచర్లపాలెం గ్రామాల్లో వరి పొలాలను మంగళవారం పరిశీలించిన ఆయన, కౌలు రైతులకు కూడా ఈ-క్రాప్‌తో సంబంధం లేకుండా ఎరువులు, రైతు భరోసా, బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.