KRNL: పెద్దకడబూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో ఇవాళ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ నిర్వహించారు. వ్యవసాయ సహాయ సంచాలకురాలు కే. అరుణకుమారి 9వ తరగతి విద్యార్థులకు మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్షల ప్రాధాన్యత, SHC యాప్‌లో రైతుల వివరాల నమోదు విధానంపై శిక్షణ ఇచ్చారు. భూసార పరీక్షల ద్వారా పంటలకు అవసరమైన ఎరువుల మోతాదును నిర్ణయించుకోవచ్చన్నారు.
వార్తలు
మట్టి నమూనాల సేకరణపై విద్యార్థులకు శిక్షణ


