హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

గోరక్షాసనం వల్ల కలిగే ప్రయోజనాలు

గోరక్షాసనం వేయడం వల్ల కాళ్ల కండరాలు బలపడుతాయి. పిరుదులు, మోకాళ్లు, మడమలు, కాలి కండరాల బిగువును తొలగించి శరీరాన్ని వంచేలా చేస్తుంది. పొట్టలోని గ్యాస్ సమస్యలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పురుషులలో శృంగారశక్తిని ప్రేరేపించి, మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మనసులోని ఆందోళనలను తగ్గించి ఏకాగ్రతను, స్థిరత్వాన్ని పెంచుతుంది.