హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

'బ్రేక్‌ ఫాస్ట్' అని ఎందుకు పిలుస్తారంటే?

మనం తినే ఆహారంలో బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం. రాత్రంతా తినకుండా ఉండడం వల్ల శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది. ఉదయం తీసుకునే ఈ మొదటి ఆహారంతోనే రాత్రి చేసిన ఉపవాసం ముగుస్తుంది. అందుకే దీనిని 'బ్రేక్ ఫాస్ట్' (ఉపవాస విరమణ) అంటారు. అల్పాహారంతో రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి అవసరమైన శక్తి, పోషకాలు లభిస్తాయి. దీంతో మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.