హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నోటి పూతలు తగ్గాలంటే ఏం చేయాలి?

నోటి పూతలు తగ్గాలంటే ఉప్పునీటితో రోజుకు 2-3 సార్లు పుక్కిలించాలి. నిమ్మరసం, తేనె కలిపి రోజుకు రెండుసార్లు రాసుకుంటే మంచిది. అలాగే, అలోవేరా జల్ రాసుకోవడం, కొబ్బరి నూనెతో నోరు పుక్కిలించడం (ఆయిల్ పుల్లింగ్) చేయాలి. పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవాలి. విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. కారం, మసాలా, వేడి ఆహారాలకు దూరంగా ఉండాలి.