హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఒరిగిన విద్యుత్ స్తంభాలు

MDK: పొలాల్లో మృత్యుపాశాల్లా వేలాడుతున్న విద్యుత్ వైర్లు కలాన్శెట్టిపల్లి రైతులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. పొలం పనులకు వెళ్లాలన్నా, పశువులను తోలుకెళ్లాలన్నా రైతాంగం ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ఒరిగిన విద్యుత్ స్తంభాలను తక్షణమే సరిచేయాలని, ఏదైనా ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులు డిమాండ్ చేశారు.