హైదరాబాద్: 28°C
క్రీడలు

వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరీ యాదవ్ రజత పతకం సాధించింది. మహిళల 53 కిలోల విభాగంలో ఆమె ఈ పతకం సాధించింది. జ్ఞానేశ్వరీ యాదవ్ స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కిలోలు ఎత్తింది. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ఇది ఐదో పతకం. ఈ పోటీలో నైజీరియాకు చెందిన ఒనోమే ఒమోలోలా దిదిహ్ స్వర్ణ పతకం సాధించింది.