హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆగస్టు 15లోగా వరి పంట బీమా నమోదు చేసుకోండి'

SKLM: ఖరీఫ్‌లో వరి సాగు చేసే రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఆగస్టు 15లోగా నమోదు చేసుకోవాలని మెలియాపుట్టి మండల వ్యవసాయ అధికారి దానకర్ణుడు సూచించారు. రుణం తీసుకున్న రైతులు బ్యాంకుల ద్వారా, ఇతరులు మీ సేవ/సీఎస్‌సీ కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చు. వరి పంటకు ఎకరాకు రూ.160 ప్రీమియం. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే బీమా రక్షణ లభిస్తుందన్నారు.