హైదరాబాద్: 28°C
క్రీడలు

జైస్వాల్‌తో మృణాల్‌ డేటింగ్‌..?

బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, క్రికెటర్ యశస్వి జైస్వాల్ డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముంబైలోని బాంద్రా కేఫే వద్ద వీరిద్దరూ వేర్వేరుగా కనిపించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వీరిద్దరూ కలిసి ఉన్న దృశ్యాలు లేవు. ఈ ప్రచారంపై ఇటు నటి, అటు క్రికెటర్ స్పందించకపోవడంతో దీనిపై స్పష్టత లేదు.