హైదరాబాద్: 28°C
క్రీడలు

'నాకు ఒకరు చెప్పాల్సిన అవసరంలేదు'

తన క్రికెట్ ప్రయాణంపై సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తానేం చేయాలో ప్రత్యేకంగా ఎవరూ చెప్పనక్కర్లేదని అన్నాడు. ప్రస్తుతం వయసు తనకు 31 ఏళ్లని, ఇంకా చాలా కాలం ఆడతానని చెప్పాడు. 2028 ప్రణాళికలపై స్పందిస్తూ.. జట్టుకు అవసరమని భావిస్తేనే ఎంపిక చేస్తారని, అప్పుడు మంచి ఇన్నింగ్స్‌లు ఆడేందుకు ప్రయత్నిస్తానని సంజు వెల్లడించాడు.