కామన్‌వెల్త్ గేమ్స్-2026లో భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెడల్ సెర్మనీలో అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుండగా, జనగణమన వింటూ మీరాబాయి చాను కళ్లలో ఆనందబాష్పాలు వెల్లువెత్తాయి. ఆ క్షణం ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో నింపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
క్రీడలు
గూస్‌బంప్స్.. అంతర్జాతీయ వేదికపై జనగణమన


