హైదరాబాద్: 28°C
వార్తలు

రహదారి లేక.. ప్రయాణికులకు తిప్పలు

MDK: నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ నుంచి తుజాల్పూర్ గ్రామానికి రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక కిలోమీటర్ తారు రోడ్డు నిర్మిస్తే సమస్య తీరుతుందని వాపోతున్నారు. నస్కల్ మీదుగా 5 కిలోమీటర్లు చుట్టూ తిరగాల్సి వస్తోందని, అధికారులు వెంటనే స్పందించి బీటీ రోడ్డు నిర్మించాలని నిజాంపేట మండల వాసులు కోరుతున్నారు.