హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ సత్తాను విజయవాడలోనే గుర్తించాం: లక్ష్మణ్

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తొలిసారి విజయవాడలోనే గుర్తించామని తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించాడు. 2024 అండర్-19 వరల్డ్ కప్ ముందు అతడి ఆటను చూసినట్లు తెలిపాడు. విజయవాడలో జరిగిన క్వాడ్రపుల్ సిరీస్‌లో ఇండియా బి తరఫున వైభవ్ టాప్ స్కోరర్ అని చెప్పాడు. అప్పటికి.. ఇప్పటికీ అదే శైలిలో ఆడుతున్నాడని కితాబిచ్చాడు.