ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌గా నిలిచిన భారత యువ సంచలనం అనాహత్ సింగ్‌ను ప్రధాని మోదీ అభినందించారు. అనాహత్ విజయం దేశానికి గర్వకారణమని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఈ ఘనత భారత స్క్వాష్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కొత్తతరం క్రీడాకారులకు ఈ విజయం స్ఫూర్తిగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు.
క్రీడలు


