హైదరాబాద్: 28°C
వార్తలు

'మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

KRNL: జూలై 31న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సీఐటీయూ నాయకులు ఎం. గోపాల్, కే. సుధాకరప్ప పిలుపునిచ్చారు. కనీస వేతనాలు అమలు చేయాలని, పెండింగ్ వేతనాలు, వంట బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థి భోజన వ్యయాన్ని రూ.20కు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.