హైదరాబాద్: 28°C
వార్తలు

బాపట్లలో మడ మొక్కల దినోత్సవం

బాపట్ల నగరవనంలో అంతర్జాతీయ మడ మొక్కల దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎఫ్‌ఓ ఎస్. రవిశంకర్ మాట్లాడుతూ.. మడ అడవులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తీర ప్రాంతాల రక్షణలో ఇవి కీలకమని వివరించారు. వన సంరక్షణ సమితి సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని మడ అడవుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.