హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి నిధి

గుంటూరు తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం రూ.15 లక్షల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రకటించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా వెన్నంటి ఉంటానని తెలిపారు.