పులి భయంతో గంటపాటు విద్యుత్ స్తంభంపైనే సిబ్బంది చిక్కుకున్న ఘటన మహారాష్ట్రలో జరిగింది. చంద్రపూర్ జిల్లా ఫుల్జరి గ్రామంలో కరెంట్ లైన్ మరమ్మతులు చేస్తుండగా పులి ప్రత్యక్షమైంది. దాన్నిగమనించిన సిబ్బంది.. ప్రాణభయంతో పైనే ఉండిపోయారు. గంటసేపు పరిసరాల్లోనే సంచరించి చివరికి పులి వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకుని కిందకు దిగారు. విద్యుత్ స్తంభంపై సిబ్బంది ఉన్న వీడియో SMలో వైరల్ అవుతోంది.
వార్తలు
పులి భయం.. గంట సేపు స్తంభంపైనే..


