హైదరాబాద్: 28°C
వార్తలు

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని పోలీసులు సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. నేరాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.