కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ జిమ్నాస్ట్ గాబ్రియెల్ లాంగ్‌టన్.. హారిజంటల్ బార్‌పై ప్రదర్శన చేస్తుండగా పట్టు తప్పి నేలపై పడిపోయాడు. పురుషుల జట్టు ఫైనల్లో విన్యాసం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. లాంగ్‌లన్ స్పృహలోనే ఉన్నాడని, వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని ఇంగ్లండ్ జట్టు వెల్లడించింది.
క్రీడలు
కామన్వెల్త్ గేమ్స్.. పడిపోయిన జిమ్నాస్ట్


