హైదరాబాద్: 28°C
క్రీడలు

అంచనా తప్పడం వల్లే ఝండూకు గోల్డ్ మిస్..!

కామన్వెల్త్ గేమ్స్-2026లో పారా అథ్లెట్ ఝండూ కుమార్ భారత్‌కు తొలి పతకం అందించిన విషయం తెలిసిందే. హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్‌లో అతడు కాంస్య పతకం గెలిచాడు. ఈ నేపథ్యంలో పారా పవర్‌లిఫ్టర్ కోచ్ రాజిందర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బంగారు పతకం కోసం తాము వేసిన లెక్క తప్పిందని చెప్పాడు. సమాచారలోపం కూడా పతకం చేజారడానికి కొంత కారణమై ఉండొచ్చని వ్యాఖ్యానించాడు.