హైదరాబాద్: 28°C
వార్తలు

పేకాట ఆడుతున్న 10 మంది అరెస్టు

ప్రకాశం: జరుగుమల్లి మండలం పైడిపాడు గ్రామ శివారులో పేకాట శిబిరంపై ఎస్సై భాగ్యరాజ్ ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పదిమంది వ్యక్తులను అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుండి 12,700 నగదు స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. మండల పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్సై భాగ్యరాజ్ హెచ్చరించారు.