హైదరాబాద్: 28°C
వార్తలు

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీ

MLG: వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పెండింగ్ కేసుల పురోగతి, ఆన్‌లైన్ నమోదు, రికార్డుల నిర్వహణ, రౌడీ షీటర్లపై చర్యలను సమీక్షించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేస్తూ ప్రజలకు పారదర్శక, నిస్పాక్షిక సేవలు అందించాలని ఆదేశించారు.