హైదరాబాద్: 28°C
వార్తలు

వేయి స్తంభాల గుడిలో ఎమ్మెల్యే పూజలు

HNK: వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ.. హనుమకొండ వేయి స్తంభాల ఆలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా శత, సహస్రశత కటాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రైతులకు పంటలు పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.