హైదరాబాద్: 28°C
వార్తలు

శాయంపేటలో ఏకలవ్య జయంతి

HNK: శాయంపేట (మం) కేంద్రంలో నేడు ఏకలవ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఏకలవ్య విగ్రహానికి బహుజన సంక్షేమ సంఘం నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ.. ఆయన నైపుణ్యం, త్యాగం ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మారెపల్లి క్రాంతికుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మొగ్గం సుమన్, తదితరులు ఉన్నారు.