హైదరాబాద్: 28°C
క్రీడలు

సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన అనాహత్ సింగ్

ప్రపంచ జూనియర్ స్క్వాష్ వ్యక్తిగత విభాగంలో భారత అమ్మాయి అనాహత్ సింగ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో హబీబా రిజ్క్ (ఈజిప్ట్‌)ను అనాహత్ ఓడించింది. ఈ టోర్నీలో వరుసగా రెండోసారి సెమీస్ చేరిన భారత తొలి ప్లేయర్ ఆమెనే కావడం గమనార్హం. గత టోర్నీలో కాంస్యం నెగ్గిన అనాహత్.. ఈసారి ఫైనల్లో చోటు కోసం ఈజిప్ట్‌కు చెందిన బార్బ్ సమెను ఢీకొట్టనుంది.