హైదరాబాద్: 28°C
భక్తి

సత్యదేవుని ఆలయానికి పోటెత్తిన భక్తులు

AP: కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సత్యదేవుని దర్శనానికి ఆలయ అధికారులు భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో భక్తులు వ్రతాలు చేశారు.