హైదరాబాద్: 28°C
భక్తి

నేడే 'తొలి ఏకాదశి'

ఆషాఢ శుద్ధ ఏకాదశినే 'తొలి ఏకాదశి'గా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. రోజంతా ఉపవాసం, జాగరణ ఉంటూ విష్ణుమూర్తిని పూజిస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే, ఈ రోజు చేసే దానధర్మాల వల్ల పూర్వీకుల దోషాలు సైతం తొలగిపోయి పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. ఈ రోజున పేలాల పిండిని ప్రసాదంగా స్వీకరిస్తారు.