హైదరాబాద్: 28°C
భక్తి

రేపు తొలి ఏకాదశి.. ఇలా చేస్తే మంచిది

తొలి ఏకాదశి సందర్భంగా రేపు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలని పురోహితులు చెబుతున్నారు. 'విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉండాలి. పూజలో తులసి దళాలు వాడాలి. మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. గోర్లు, జుట్టు కత్తిరించకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. రోజంతా దైవనామ స్మరణ చేస్తూ రాత్రి జాగారం చేయడం శ్రేయస్కరం' అని సూచిస్తున్నారు.